బాణాసంచా నిల్వలపై గ్రామస్తులకు అవగాహన

బాణాసంచా నిల్వలపై గ్రామస్తులకు అవగాహన

VZM: బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని బాడంగి మండలం రావివలస గ్రామంలో బాణాసంచా నిల్వలు, ఆనధికారకంగా తయారుచేయడంపై సీఐ నారాయణరావు, సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా బాణాసంచా తయారుచేయకూడదని సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై గ్రామస్తులకు వివరిస్తూ అవగాహన కల్పించారు. గ్రామాల్లో స్నేహభావంతో మెలగాలన్నారు.