VIDEO: రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయండి: డీఎస్పీ
SRPT: వాహనదారులు నిర్లక్ష్యం వీడి, అప్రమత్తంగా వాహనాలు నడపాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. ఇవాళ సూర్యాపేటలో ‘అలైవ్ అండ్ అరైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నదే పోలీసుల ఆశయమన్నారు. రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం అందరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐ వెంకట్, ఎస్సై సాయి రామ్ ఉన్నారు.