VIDEO: గ్యాస్ సిలిండర్ కోసం కిలోమీటర్ల దూరం క్యూ లైన్
MHBD: బయ్యారం మండల కేంద్రంలో రాజరాజేశ్వరి హెచ్.పి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఎదుట గ్యాస్ వినియోగదారులు గురువారం తెల్లవారు జామునుండే క్యూ కట్టారు. గ్యాస్ సిలిండర్లు వచ్చాయని సమాచారం రావడం తో వినియోగదారులు కిలోమీటర్ల దూరం వరకు క్యూ కట్టడం విశేషం. ఈ సందర్భంగా ప్రజల్లో అందోళన నెలకొంది, సిలిండర్లు సమయానికి అందకపోవడం వల్ల అనేక మంది నిరాశ వ్యక్తం చేశారు.