నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLR: బోగోలులోని విశ్వనాథరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అరవపాళెం, విశ్వనాథరావుపేట, ఇబ్రహీంపేట, బేతనీపేట, రామస్వామిపాళెం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీస్కం ఏఈ జడరాయ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.