చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం: MLC

GNTR: చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెనాలిలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన చేనేత కార్మికులను సత్కరించారు. విద్యుత్ రాయితీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.