డైట్ కళాశాలలో పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు

శ్రీకాకుళం జిల్లాలోని వమరవల్లిలోని డైట్ కళాశాలలో ఎస్ఎస్ టీసీ ప్రాతిపదికన డిప్యుటేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్. తిరుమల చైతన్య తెలిపారు. డైట్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న 5 సీనియర్ లెక్చలర్లు, 17 లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించామన్నారు.