త్వరలో మహానగరంగా మన నల్గొండ
నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా (మహానగరంగా) మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 48 వార్డులను 50 డివిజన్లుగా పునర్విభజించనున్నారు. పట్టణ జనాభా సుమారు 2.5 లక్షలు, వార్షిక ఆదాయం రూ.40 కోట్లు దాటడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రభుత్వ గెజిట్ ద్వారా నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారే అవకాశం ఉంది.