ఆన్‌లైన్ పద్ధతిలో ఇసుక విక్రయాలు: కలెక్టర్ రాజర్షి షా
ADB: వినియోగదారులు తమకు కావలసిన ఇసుకను tgmiv.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 'MIV Mobile App' ద్వారా సులభంగా బుక్ చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలియజేశారు. 'మన ఇసుక - వాహనం' (MIV) పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్ పద్ధతిలో ఇసుక విక్రయాలు జరుగుతాయని అన్నారు. హెల్ప్ డెస్క్ నెంబర్ 7569538588 సంప్రదించాలని కలెక్టర్ కోరారు.