‘ఎమ్మెల్యే పసుపు రైతులకు క్షమాపణ చెప్పాలి’
JGL: పసుపు ధరలు పెరిగి రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అనుచితమని బీజేపీ కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి అన్నారు. క్వింటాల్‌కు రూ.12,000 ధర రావడం రైతులకు లాభదాయకమని, ధరలు పడిపోతాయని చెప్పడం సరైంది కాదన్నారు. రైతులకు మార్గదర్శకత్వం ఇవ్వాల్సింది ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.