నేత్రదానం.. పునర్జీవనం
NTR: నేత్రదానం చేసి ఆ కుటుంబం అందరికి ఆదర్శంగా నిలిచింది. తిరువూరుకు చెందిన పసుమర్తి శకుంతల (80) అనారోగ్యంతో కన్నుమూయగా, కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేశారు. లయన్స్ క్లబ్ తిరువూరు ఆధ్వర్యంలో విజయవాడ ఐ హాస్పిటల్ నిపుణులు కార్నియాను సేకరించారు. విషాద సమయంలోనూ నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను క్లబ్ ప్రతినిధులు ప్రశంసించారు.