నకిలీ నోట్ల మోసం.. విదేశీ నిందితుడి అరెస్ట్

నకిలీ నోట్ల మోసం.. విదేశీ నిందితుడి అరెస్ట్

NLG: నకిలీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ ఆఫ్రికా దేశస్థుడు గోయిటా సౌంగాలోను తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు లక్ష అసలు నోట్లకు ఐదు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. నల్లటి కాగితాలకు రసాయనం పూసి నోట్లుగా మారుస్తానని అమాయకులను నమ్మిస్తున్నాడన్నారు.