కొడవళ్లు చేతపట్టి.. నిమజ్జనంలో ఉద్రిక్తత

ATP: జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం సాయంత్రం గ్రామంలోని ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. విగ్రహ ఊరేగింపు సందర్భంగా వాగ్వాదం జరిగింది. కొడవళ్లతో దాడులకు దిగడంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.