కొత్తపోలమ్మ అమ్మవారి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
PPM: కొత్తవలసలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు జరిగే గ్రామదేవత కొత్తపోలమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలకు గురువారం స్థానిక MLA బోనెల విజయ్ చంద్రను ఆలయ కమిటీ, ఆ గ్రామ పెద్దలు ఆహ్వానించారు. ఈ మేరకు TDP కార్యాలయంలో ఆయనను కలిసిన గ్రామ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.