బొడ్రాయి ప్రతిష్టాపనలో MP ప్రత్యేక పూజలు
MDK: దుబ్బాకలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రధాన గ్రామ దేవత బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహోత్సవంలో మెదక్ MP రఘునందన్ రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాలు, అభిషేకాలు నిర్వహించగా, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు.