ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో మృత్యుఘోష
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మృత్యుఘోషగా మారింది. ఇప్పటివరకు ఇరాన్‌లో 1,332 మంది మరణించారు. వీరిలో 200 మందికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు. పలు ఆసుపత్రులు, భవనాలు ధ్వంసమయ్యాయి. అలాగే.. లెబనాన్‌లో 394 మంది, ఇజ్రాయెల్‌లో 11 మంది, అమెరికాలో ఆరుగురు, గల్ఫ్ దేశాల్లో 11 మంది మృతిచెందారు.