2026 మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

2026 మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

NLR: వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.