ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: జేసీ

కోనసీమ: ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయం పాటించాలన్నారు.