పెదబయలులో రోడ్డు ప్రమాదం
ASR: పెదబయలు మండలం ఆరాడకోట పంచాయితీ పురుగుడు పుట్టు మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదబయలు నుంచి పాడేరు వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే పెదబయలు ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.