VIDEO: ఘనంగా వనభోజన మహోత్సవం
NDL: దిగువ అహోబిలం అల్వార్ కోనేరు సమీపంలోని లక్ష్మీవనంలో 3వ కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం చేపట్టారు. అర్చకులు అభిషేకం, పూజలు నిర్వహించి, శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు వితరణ చేసినట్లు దేవస్థానం ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు.