ఈనెల 7న సుంకులాపరమేశ్వరి ఆలయం మూసివేత

ఈనెల 7న సుంకులాపరమేశ్వరి ఆలయం మూసివేత

KRNL: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, సెప్టెంబర్ 7న కోడుమూరు నియోజకవర్గంలోని కే.నాగలాపురం సుంకులాపరమేశ్వరి అమ్మవారి ఆలయం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూసివేయబడుతుందని ఆలయ ఈవో రాధాకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 5 గంటలకు ఆలయం తెరిచి, శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించబడుతుందన్నారు.