సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత

సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత

TPT: సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం దాదాపు 12 గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. అయితే అదే రోజున భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 30వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసి సాయంత్రం నుంచి పంపిణీ చేయనున్నారు. కాగా, వీటిని వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాలు, సేవా సదన్ వద్ద అందించనున్నారు.