INSPIRATION: మేరీ కోమ్

INSPIRATION: మేరీ కోమ్

బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ మణిపూర్‌లోని పేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఇష్టం ఉన్నా, బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఎన్నో సామాజిక అడ్డంకులు ఎదుర్కొంది. అయినా వెనుకడుగు వేయలేదు. తల్లి అయిన తర్వాత కూడా దేశం తరపున బరిలోకి దిగి అనేక పతకాలు గెలిచింది. పట్టుదల, కుటుంబ మద్దతు ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆమె నిరూపించింది.