'జిల్లాలో నూతన రోడ్డుకు ప్రతిపాదనలు ఇచ్చాం'

'జిల్లాలో నూతన రోడ్డుకు ప్రతిపాదనలు ఇచ్చాం'

PPM: పాచిపెంట మండలం గరసిగుడ్డి పంచాయతిలో జీలిగివలస గ్రామం నుంచి మర్రిపాడు గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం జరగనుంది. రూ.1 కోటి అంచనా విలువతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని కార్యనిర్వాహక ఇంజనీర్ ఎ. మణిరాజు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఒక దినపత్రికలో ప్రచురితమైన 'రాళ్లు రప్పలు ఏంటీ తిప్పలు' అనే శీర్షికకు ఆయన ఇవాళ స్పందించారు.