ఆ దేశాలను విడిచివెళ్లండి.. అమెరికా సూచన
విదేశాల్లో ఉన్న తమ దేశ పౌరులకు అమెరికా కీలక సూచన చేసింది. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ, సిరియా, UAE, యెమెన్ దేశాలను వాణిజ్య మార్గాల ద్వారా విడిచి వెళ్లాలని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే వెళ్లిపోవాలని వెల్లడించింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు వినియోగించుకోవాలని పేర్కొంది.