నరసన్నపేట మండల వాసి సూసైడ్

నరసన్నపేట మండల వాసి సూసైడ్

SKLM: నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన లుకలాపు హరికృష్ణ (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జిల్లా దువ్వాడలోని ప్రైవేట్ కంపెనీలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య వెంకటలక్ష్మితో పాటు దువ్వాడలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.