శక్తి యాప్ వినియోగంపై అవగాహన

శక్తి యాప్ వినియోగంపై అవగాహన

ELR: మహిళల భద్రతకు, భరోసాకు శక్తి యాప్ ఎంతో తోడ్పడుతుందని ఏలూరు మూడు పట్టణ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరులో శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్గించారు. సీఐ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినిలు, యువతులు ఆపద సమయాల్లో శక్తి యాప్‌ను వినియోగించడం ద్వారా క్షణాల్లో పోలీసుల సహాయం వారికి అందుతుందన్నారు. లైవ్ లొకేషన్ ద్వారా పోలీసులు అక్కడికి చేరుకుంటారు.