VIDEO: మొక్కలు నాటుతూ గిరిజనులు నిరసన

Akp: రావికమతం మండలం అర్జాపురం రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ఆదివాసి గిరిజనులు రోడ్డుపై మొక్కలు నాటుతూ నిరసన చేపట్టారు. సీపీఎం నాయకులు గోవిందరావు మాట్లాడుతూ.. 2024లో రోడ్డు ప్రారంభించి మధ్యలోనే వదిలేయడం వల్ల గిరిజనుల రోడ్డు కష్టాలు తీరలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా తెలిపారు.