మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ నుంచి రూ.15 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలగిరి నుంచి మాలిపురం కట్ట వరకు రూ.6 కోట్లతో డబుల్ రోడ్డు పనులు, మున్సిపాలిటీలో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, రూ.3 కోట్లతో డ్రైయినేజీలు ఏర్పాటు చేయనున్నారు.