జగన్ పార్టీకి కొత్త జెండా: టీడీపీ నేత
PLD: చిలకలూరిపేటలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వైసీపీకి కొత్త జెండా నమూనాను గురువారం విడుదల చేశారు. గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గుర్తులతో దీన్ని డిజైన్ చేశారు. ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్‌కు ఈ జెండానే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అమరావతికి ప్లాన్-బీ అవసరం లేదని, జగన్‌కే తాము ప్లాన్-బీ ఇస్తున్నామని ఆయన తీవ్రంగా విమర్శించారు.