ఎన్టీఆర్ క్రేజ్.. 'సీఎం.. సీఎం' అంటూ నినాదాలు
బెంగళూరులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ క్రేజ్ మరోసారి శిఖరాగ్రానికి చేరింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన NTRని చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. రహదారులన్నీ కిక్కిరిసిపోగా, ఎన్టీఆర్ కాన్వాయ్ కనిపించగానే 'సీఎం.. సీఎం' అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. కన్నడ గడ్డపై తారక్ పట్ల ఉన్న అపారమైన అభిమానం ఈ వేడుకతో మరోసారి రుజువైంది.