VIDEO: చిన్న శంకరంపేటలో బీజేపీ సంబరాలు

VIDEO: చిన్న శంకరంపేటలో బీజేపీ సంబరాలు

MDK: చిన్న శంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. యుద్ధంలో పాల్గొన్న సైనికులకు వందనాలు తెలిపారు.