వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం

KNL: పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసీపీ నాయకుడు బనగాని శ్రీనివాసులు స్పందించారు. విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.