40 లీటర్ల నాటుసారా లభ్యం

VZM: గుర్ల పోలీసు స్టేషన్ సిబ్బంది దేవునికనపాకలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై నారాయణరావు తెలిపారు. వారి వద్ద నుండి 40 లీటర్ల నాటుసారా లభ్యమైనట్లు చెప్పారు. తయారు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.