ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు

ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు

ASF: ఆసిఫాబాద్ బస్టాండ్ నుంచి జానకాపూర్ వెళ్లే ప్రధాన రహదారులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలమయంగా మారాయి. ప్రమాదకరంగా గుంతలు ఏర్పడటంతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారి గుండా వాహనాదారులు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ దారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.