'బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి'
KMR: బిక్కనూర్ బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సాధన స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ గిరిజ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆరోగ్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఎమ్ సంధ్య రాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు