ఉర్దూ విభాగంలో ఏప్రిల్ 8న వర్క్‌షాప్

ఉర్దూ విభాగంలో ఏప్రిల్ 8న వర్క్‌షాప్

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో “ఉర్దూలో పరిశోధన కళ - ఆధునిక అవసరాలు” అనే శీర్షికతో ఒకరోజు కార్యశాల నిర్వహించనున్నారు. ఈమేరకు కార్యశాల బ్రోచర్లను వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఆ విభాగం అధ్యాపకులతో కలసి ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ కన్వీనర్ డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ గాన్ ఉన్నారు.