మార్కెట్ యార్డ్ నూతన ఛైర్మన్ ప్రమాణస్వీకారం

కృష్ణా: గన్నవరం మార్కెట్ యార్డ్ నూతన ఛైర్మన్‌గా గూడవల్లి నరసింహారావు (నరసయ్య) గారు, బోర్డు సభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం గన్నవరంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతుల సంక్షేమం, పారదర్శక పరిపాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.