CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం నెల్లూరు నగరంలోని ఆమె కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. దాదాపు రూ. 6.46 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యాల బారిన పడి కష్టాలలో ఉన్న కుటుంబాలకు CMRF ఆర్ధిక సహాయం కొండంత అండగా నిలుస్తుందన్నారు.