'జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం'

VKB: జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.