మురుగునీటి సమస్యల పరిష్కారానికి ముందు అడుగు

SKLM: ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామంలో శనివారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జరిగాయని గ్రామ సర్పంచ్ సనపల చల్లన్నాయుడు తెలిపారు. గ్రామంలో ఆర్ అండ్ బి కాలువ వేసిన దగ్గర నుంచి పేరుకుపోయిన పూడికలను పారిశుధ్య సిబ్బంది సహకారంతో తొలగించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి పి.రాము, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పి. సుధీర్ కుమార్ ఈ పనులను పర్యవేక్షించారని అన్నారు.