‘ఈ నెల 13 నుంచి ప్రజా రాజధాని-అభివృద్ధి పాదయాత్ర’
GNTR: అమరావతి ప్రాంతంలోని సమస్యల అధ్యయనం కోసం ఈనెల 13 నుంచి 18 వరకు రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో "ప్రజా రాజధాని-అభివృద్ధి పాదయాత్ర"ను జయప్రదం చేయాలని రాజధాని అభివృద్ధి వేదిక కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు కోరారు. ఇవాళ గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.