పాకలోనే పాఠశాల.. గుడిసె గ్రామస్థుల ఆవేదన
ASR: జాతీయ పర్యాటక కేంద్రమైన మారేడుమిల్లి మండలం గుడిసెలో పాఠశాల దుస్థితికి అద్దం పడుతోంది. పక్కా భవనం లేక విద్యార్థులు కర్రల పాకలోనే చదువుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అల్లూరి, పోలవరం జిల్లాల్లోని అనేక గ్రామాల్లో పాఠశాల భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.