ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులు

ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులు

AKP: పాయకరావుపేట పీహెచ్సీలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యాధికారులకు హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు జిల్లా అధికారులు గురువారం షోకాస్ నోటీసులు జారీ చేశారు. హోంమంత్రి ఈనెల మూడవ తేదీన స్థానిక పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యాధికారులు గైర్హాజరు కావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీఎం అండ్ హెచ్ఓకు ఫిర్యాదు చేశారు.