VIDEO: పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
VSP: సబ్బవరం మండలంలో 'మీభూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా 1500 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో పూర్తి పారదర్శకంగా వీటిని అందిస్తున్నామని, రెవెన్యూ అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలను మెరుగుపరచాలని సూచించారు.