iBOMMA కేసులో ఈడీ ఎంట్రీ

iBOMMA కేసులో ఈడీ ఎంట్రీ

HYD: IBOMMA పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. IBOMMA కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై HYD సీపీకి లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని లేఖలో వెల్లడించింది. కాగా ఈ నెల 15న HYD సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్ట్ చేసి కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే.