రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ATP: పామిడి పట్టణ శివారులో రోడ్డు దాటుతున్న షాషావలి అనే వ్యక్తిని గురువారం రాత్రి తుఫాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో షాషావలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామిడి సీఐ యుగంధర్ తెలిపారు.