'మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దాం'

'మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దాం'

KNR: అందరం కలిసి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి, కరీంనగర్ జిల్లాను ఇందులో ఆదర్శంగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. గురువారం సాయంత్రం జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.