VIDEO: గజపతినగరంలో లారీ బీభత్సం

VZM: గజపతినగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 26వద్ద శుక్రవారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న నాలుగు షాప్‌లపైకి దూసుకెళ్లి, 11kv విద్యుత్ టవర్‌ను ఢీకొని ఆగింది. ఆ సమయంలో షాపుల వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.