ఈనెల 10న పోలేరమ్మ జాతర ప్రారంభం

E.G: కడియం మండలం దుళ్ళ గ్రామదేవత పోలేరమ్మ జాతర సంబరాలు ఈ నెల 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మొదటి రోజు అమ్మవారిని అలంకరించి పెద్ద సంబరంలా ప్రారంభిస్తారని చెప్పారు. సాయంత్రం గరగ నృత్యంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. పోలేరమ్మ తీర్థం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని వెల్లడించారు.