పశువులను అపహరిస్తున్న దొంగల ముఠా అరెస్ట్

ప్రకాశం: మర్రిపూడిలో శనివారం పశువులను అపహరిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 కత్తులు, 3 ఇనప రాడ్లు, రూ. 4.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పశువులను తరలిస్తున్న ట్రాలీ వాహనాన్ని తనిఖీ చేయగా ఈ ముఠా గుట్టు రట్టయింది. నిందితులు ఏడుగురిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.